Balakrishna – Boyapati : బాలయ్య బోయపాటి సినిమా అప్డేట్ వచ్చేసింది.. బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్.. అఖండ 2..?

నేడు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో బాలయ్య - బోయపాటి సినిమా అప్డేట్ ప్రకటించారు.

Balakrishna – Boyapati : బాలయ్య బోయపాటి సినిమా అప్డేట్ వచ్చేసింది.. బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్.. అఖండ 2..?

Balakrishna Boyapati Sreenu Combo Movie Announced on Balayya Birthday

Balakrishna – Boyapati : బాలయ్య – బోయపాటి శ్రీను కాంబో అభిమానులతో పాటు అందరికి ఫేవరేట్. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టారు ఈ కాంబో. దీంతో ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందని, అఖండ 2 అని గతంలోనే ప్రకటించారు.

Also Read : Simran Choudhary : కొత్త హీరోతో సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా..

నేడు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో బాలయ్య – బోయపాటి సినిమా అప్డేట్ ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా నేడు సినిమాని ప్రకటించారు. BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమాలో బాలయ్య కూతురు తేజస్విని నందమూరి కూడా నిర్మాతగా భాగమవడం గమనార్హం. తేజస్విని గతంలో బాలయ్య అన్ స్టాపబుల్ కి కూడా పనిచేసింది. పూర్తిగా ఇకపై సినిమా రంగంలోనే తేజస్విని ఉండబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా అఖండ 2 అనే అంతా భావిస్తున్నారు. మూవీ యూనిట్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.