×
Ad

Vijay Rashmika : అమ్మమ్మ తాతయ్య సమాధుల వద్ద ఆశీస్సులు తీసుకున్న విజయ్.. పెళ్లి తర్వాత మొదటిసారి రష్మికతో కలిసి..

తాజాగా విజయ్ - రష్మిక నేడు ఉదయమే విజయ్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారు.(Vijay Rashmika)

  • Published On : March 5, 2026 / 11:37 AM IST
1/5
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. విజయ్ రష్మిక రిసెప్షన్ కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరయి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
2/5
తాజాగా విజయ్ - రష్మిక నేడు ఉదయమే విజయ్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారు. విజయ్ మేనమామ, నిర్మాత యష్ రంగినేని ఇంటికి వెళ్లారు.
3/5
అక్కడ విజయ్ తన తాతయ్య రంగినేని గోపాల్ రావు, అమ్మమ్మ రంగినేని ప్రమీల సమాధుల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన మేనమామ ఇంటికి, అక్కడ ఉన్న బంధువుల ఇంటికి విజయ్ రష్మిక కలిసి వెళ్లారు.
4/5
పెళ్లి తర్వాత విజయ్ రష్మిక ని తీసుకొని మొదటిసారి అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో ఆ ఊళ్ళో జనాలు విజయ్ - రష్మిక జంటను చూడటానికి, వారితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
5/5
Vijay Rashmika