Leo : లియో మూవీతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. భారీ ధరకి తెలుగు రైట్స్‌ కొనుగోలు..!

విజయ్ లియో మూవీతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ మూవీ తెలుగు రైట్స్‌ని..

Vijay Leo movie telugu rights is bagged by Sitara Entertainments

Leo – Sitara Entertainments : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిద్యభరిత, ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇతర భాషల అగ్ర హీరోలతో కూడా సినిమా చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ధనుష్ తో ‘సార్’ (వాతి) వంటి సూపర్ హిట్ సినిమా తీసి తమిళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ గా అడుగుపెట్టారు. ఇప్పుడు మరో తమిళ్ స్టార్ హీరో సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Rana Daggubati : త్రివిక్రమ్ రచనతో రానా ‘హిరణ్యకశిపుడు’.. అమెరికా వెళ్ళింది ప్రభాస్ కోసం కాదు..

దళపతి విజయ్ మరియు సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. ఈ మూవీ పై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు తెలుగు ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

Eesha Rebba : అభిమానుల‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. తండ్రి ఎక్క‌డంటే..?

దీంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడానికి లియో సినిమా పర్ఫెక్ట్ అని భావించి ఆ మూవీ తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నారట. దాదాపు 20 కోట్లతో ఈ మూవీ రైట్స్ ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ మూవీస్ తెలుగు రైట్స్ సేల్స్ ఇదే హైయెస్ట్. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది.

కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా సాగిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు