×
Ad

Ranabaali: విజయ్- రష్మికకు ‘రణబాలి’ టీం సర్ ప్రైజ్.. స్పెషల్ పోస్టర్ విడుదల

'రణబాలి(Ranabaali)' సినిమా నుంచి విజయ్- రష్మిక స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన టీం.

Vijay-Rashmika special poster from Ranabaali movie

  • విజయ్- రష్మిక జంటగా రణబాలి మూవీ
  • ఇద్దరి పెళ్లి వేళ స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన టీం
  • అది కూడా పెళ్లి ఫోటోనే అవడం విశేషం

Ranabaali: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఘనంగా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి మరీ ఎడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Dacoit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ మూవీ టీం.. ఫోటోలు వైరల్

ఈనేపథ్యంలోనే రణబాలి మూవీ టీమ్ కొత్త జంటకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి విజయ్- రష్మిక పెళ్లి ఫోటోను షేర్ చేసింది. దీంతో, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ – రష్మిక జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి(Ranabaali). పాన్ ఇండియా లెవల్లో పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తరువాత విజయ్- రష్మిక నటిస్తున్న సినిమా ఇది. అందుకే, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.