Ntr-Vijay: అప్పట్లో అన్న ఎన్టీఆర్.. ఇప్పుడు సీఎం విజయ్.. ‘జన నాయగన్’ మూవీతో రేర్ రికార్డ్!

సీనియర్ ఎన్టీఆర్ తరగతిలోనే తన జన నాయగన్ సినిమాను విడుదల చేయనున్న విజయ్ తళపతి(Ntr-Vijay).

vijay thalapathi jana naayagan movie releasing on vijay birthday

  • సీఎం విజయ్ చివరి చిత్రం జననాయగన్
  • జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
  • ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో రికార్డుల వేట షురూ

Ntr-Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఇకపై సినిమాలు చేయనని, పూర్తి సమయం ప్రజల కోసమే కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (దళపతి 69) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్నో సెన్సార్ అడ్డంకులను దాటుకుని, ఈ ల్యాండ్‌మార్క్ మూవీ విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Shiva Rajkumar: రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు గ్యారంటీ.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్

నిజానికి సెన్సార్ సమస్యల కారణంగా ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అప్పట్లో రాజకీయ కారణాల వల్ల ఈ చిత్రాన్ని అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే, విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని, టైటిల్ కార్డ్స్‌లో ‘సీఎం విజయ్(Ntr-Vijay)’ అని ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. వెంకట నారాయణ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ పరిణామం అప్పట్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ను గుర్తుచేస్తోంది. ఎన్టీఆర్ సీఎం కాకముందే షూటింగ్ పూర్తయిన ఆ చిత్రం, రెండేళ్ల సెన్సార్ వివాదాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే విడుదలైంది. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఆయన సీఎం అయ్యాక విడుదల కాబోతున్న ఏకైక చిత్రంగా ‘జన నాయగన్’ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.