Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న ‘జన నాయగన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Jana Nayagan Release Date: పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న విజయ్ జన నాయగన్(Jana Nayagan) మూవీ.

vijay thalapathy jana nayagan movie ready to release

  • థియేటర్స్ కి వస్తున్న జన నాయగన్
  • రేపు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రానుంది
  • ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం గత కొంతకాలంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తోంది. సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ, విడుదలలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా, ఈ సినిమా క్లిప్‌లు నెట్టింట లీక్ అవ్వడం, ఒక లోకల్ టీవీ ఛానెల్‌లో ఏకంగా సినిమానే ప్రసారం కావడం పెద్ద సంచలనంగా మారింది. పైరసీ కోరల్లో చిక్కుకున్న ఈ సినిమా థియేటర్ల వరకు వస్తుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

*హిట్ కోసం కుర్ర హీరోతో మూవీ.. హరీష్ శంకర్ పక్కా ప్లాన్

అయితే, ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక సానుకూల వార్త బయటకు వచ్చింది. అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేయనుందట. దీంతో ఈ ప్రాజెక్టుకు చట్టపరంగా, సాంకేతికంగా ఉన్న అన్ని లైన్లూ క్లియర్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయగన్ (Jana Nayagan)’ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సినిమా కోసం వేచి చూస్తున్న విజయ్ అభిమానులు ఈ వార్తతో ఒక్కసారిగా ఖుషీ అవుతున్నారు. లీక్‌లు, పైరసీ సమస్యలు ఉన్నప్పటికీ, తమ అభిమాన హీరోను వెండితెరపై చూడటమే అసలైన అనుభూతి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి మరి.