Jana Nayagan Release date: విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతున్న విజయ్ తలపతి జన నాయగన్(Jana Nayagan Release date) మూవీ.
Vijay thalapathy jana nayagan movie release date fix
- విజయ్ ‘జననాయగన్’ సినిమా విడుదల.
- జూన్ 19న గ్రాండ్ రిలీజ్.
- అడ్డంకులు దాటి వస్తున్న దళపతి.
Jana Nayagan Release date: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు నటించిన ‘జన నాయగన్(Jana Nayagan Release date)’ చిత్ర విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. షూటింగ్ పూర్తయినప్పటికీ, కొన్ని సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినిమా అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Nainika Anasuru: వైట్ డ్రెస్సులో కేకపెట్టిస్తున్న ఢీ డాన్సర్ నైనిక.. ఫొటోలు వైరల్
ఈ తరుణంలో చిత్ర యూనిట్ అభిమానులకు ఊహించని అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. “నాయకుడు వచ్చేస్తున్నాడు” అంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్తో దళపతి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
