Vijay: రాజకీయాల్లో పవన్ ని ఫాలో అవుతున్న విజయ్.. అదే డైలాగ్ ను మక్కీకి మక్కీ దించేశాడుగా
TVK పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ను వాడిన విజయ్(Vijay).
- V Santhosh Kumar
- Published On : February 14, 2026 / 07:33 AM IST
Vijay used Pawan Kalyan dialogue in political meeting
Vijay: సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు నటులు రాజకీల్లోకి వచ్చారు రాణించారు కూడా. హీరోయిన్స్ కూడా రాజకీయ రంగంలో రాణించారు. ఇటీవల తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తమిళనాట స్టార్ హీరో విజయ్(Vijay) కూడా రాజాకీయ రంగప్రవేశం చేశారు. తమిళగా వెట్రి కళగం అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉంటానని, కేవలం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు.
అన్నట్టుగా అదే ద్యేయంతో ముందుకు సాగుతున్నారు విజయ్. తనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ రాజకీయ మీటింగ్ లో పాల్గొన్నాడు విజయ్. ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అని మక్కీకి మక్కీ దించేశాడు. దీంతో ఇప్పుడు విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పార్టీ మీటింగ్ లో విజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మీ వోటు కోసం డబ్బులు పంచుతారు. వాటిని వద్దు అనకండి. తీసుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ డబ్బు మీదే. ఆ డబ్బులు తీసుకొని మీ ఓటును మన పార్టీకి అంటే TVK పార్టీ కి వెయ్యండి” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదే డైలాగ్ ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వాడాడు.
దీంతో, ఇప్పుడు విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కావాలనే ఆ డైలాగ్ ని ఆయన వాడారా లేదా ఫ్లోలో చెప్పేశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విజయ్ చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ లాగే తప్పకుండా విజయం సాధిస్తారు అనే కామెంట్స్ కేసుల వినిపిస్తున్నాయి.
