Vijay
విజయ్ విడాకుల కేసు
కోర్టు బయటే సెటిల్ చేసుకుంటారని రూమర్స్
తమిళనాట సంచలనంగా విజయ్ డైవర్స్ కేసు
Vijay : తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ నుంచి తన భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇలా విజయ్ భార్య విడాకులు కోరడం, అతని కొడుకు డైరెక్టర్ సంజయ్ సోషల్ మీడియాలో నాన్న విజయ్ ని అన్ ఫాలో చేయడంతో సంచలనంగా మారింది.
విజయ్ ఒక అమ్మయితో సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ సంగీత డివోర్స్ పిటీషన్ లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటివరకు విజయ్ దీనిపై స్పందించలేదు. తాజాగా తమిళనాట విజయ్ డివోర్స్ గురించి ఓ వార్త వినిపిస్తుంది. కోర్టులో కాకుండా బయటే విజయ్ తన భార్యతో ఈ డివోర్స్ కేసు సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : Jabardasth Faima : జబర్దస్త్ ఫైమా హోలీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
ఈ డివోర్స్ కి గాను విజయ్ ఈ సమస్యని మరింత పెద్దది చేయకుండా తన భార్య సంగీత, జేసన్ సంజయ్, సాషాల భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని రూమర్స్ వస్తున్నాయి. ఇలా భారీ మొత్తం ఇచ్చి విజయ్ కోర్టు బయటే తన విడాకుల సమస్యని సెటిల్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అయినా విజయ్ కానీ, విజయ్ టీమ్ కానీ స్పందిస్తారేమో చూడాలి.