Vijayawada IAS officers also need free movies in Private Theater
Movies : సినిమా అన్నది ఒక రిలాక్సేషన్. ఎంత స్ట్రెస్ లో ఉన్నప్పటికీ ఏదైనా ఒక మంచి సినిమా చూస్తే చాలు ఆ స్ట్రెస్ అంతా పోతుంది. వీలు దొరికినప్పుడల్లా చాలా మంది ఈ సినిమాలు చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొంతమంది ప్రభుత్వ అధికారులకి మాత్రం ఈ అదృష్టం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వారికున్న పనులు, తమకున్న సెక్యూరిటీ వల్ల నార్మల్ ఆడియన్ గా వారు సినిమా చూడలేరు.
Also Read : Raashii Khanna : పేరెంట్స్ తో కలిసి కాశీలో బర్త్ డే జరుపుకున్న రాశి ఖన్నా.. ఫొటోస్ వైరల్
అయితే తాజాగా ఈ విషయం గురించి విజయవాడలోని ఐఏఎస్ లు ఫిలిం ఛాంబర్ కి ఓ వినతి పత్రాన్ని పంపారు. తమ కోసం తెలుగు కొత్త సినిమాల స్పెషల్ షోలు వేయాలని కోరారు. వారికోసం ప్రతి శని, ఆదివారం స్పెషల్ షోస్ ఏర్పాటు చెయ్యాలని, అదికూడా ఫ్రీగా అని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే విజయవాడలో ఈ అధికారుల కోసం ఓ మినీ థియేటర్ ఉంది. వాటిలో ఇప్పటి నుండి వచ్చే పెద్ద సినిమాల స్పెషల్ షోస్ వెయ్యాలని కోరారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఆ థియేటర్ లో 48 మంది సినిమా చూడొచ్చు.
శని, ఆదివారం తమతో పాటు వారి ఫ్యామిలీ కూడా ఆ సినిమాల స్పెషల్ షోస్ చూసే విదంగా ఏర్పాట్లు చెయ్యాలని పేర్కొన్నారు. మరి విజయవాడలోని ఐఏఎస్ లు కోరిన ఈ కోరికను ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీరుస్తారా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ లో గతకొంత కాలంగా స్పెషల్ షోస్ వెయ్యడం ట్రెండ్ అయిపోయింది. అలాంటిది ఈ స్పెషల్ షోస్ విజయవాడలోని ఐఏఎస్ ఆఫీసర్స్ కి వేస్తారా లేదా చూడాలి.