ANAKAPALLI Teaser : ఆకట్టుకుంటున్న అనకాపల్లి టీజర్
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం అనకాపల్లి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను (ANAKAPALLI Teaser) విడుదల చేశారు
- Thota Vamshi Kumar
- Published On : March 30, 2026 / 10:13 AM IST
Vikram Sahidev ANAKAPALLI Teaser out now
ANAKAPALLI Teaser : విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం అనకాపల్లి. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు త్రినాథరావు నక్కిన.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి’ అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anchor lasya : శ్రీరామ నవమి స్పెషల్.. నిండైన చీరకట్టులో యాంకర్ లాస్య.. ఫోటోలు వైరల్..
