Vishwak Sen : ఆ నటుడు చేసిన పని వల్ల నాకు చాలా నష్టం జరిగింది

హీరో విశ్వక్ సేన్ ఓ సీనియర్ నటుడు చేసిన పని వల్ల చాలా నష్టపోయానంటూ కామెంట్స్ చేసారు. తాజా ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vishwak Sen : ఆ నటుడు చేసిన పని వల్ల నాకు చాలా నష్టం జరిగింది

Vishwak Sen

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. లైలా అనే కొత్త ప్రాజెక్టుతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్ట్, గామి, VS10 సినిమాలు చేస్తున్నారు. వీటిలో గామి మార్చి 8న రిలీజ్ అవుతోంది . ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన విశ్వక్ సేన్ సీనియర్ నటుడు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vishwak Sen 2

Vishwak Sen 2

Miss World 2024 : మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి భారత్ నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

విశ్వక్ సేన్ ఆరు సినిమాలు చేస్తుండగా వాటిలో రెండు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అఘోరా పాత్రలో విశ్వక్ నటిస్తున్న ‘గామి’ మార్చి 8న రిలీజవుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాస్త గ్యాప్‌లో విడుదల కాబోతోంది. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో సీనియర్ హీరో అర్జున్‌పై విశ్వక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో అర్జున్ డైరెక్షన్‌లో తన కూతురు హీరోయిన్‌గా విశ్వక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేసారు. విశ్వక్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో వివాదం చెలరేగింది. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. దీనిపై విశ్వక్ కూడా అప్పట్లో సమాధానం ఇచ్చారు. అయితే ఈ వివాదం తనపై చాలానే ప్రభావం చూపించిందని  తాజాగా విశ్వక్ సేన్ మాట్లాడారు.

D50 : ధ‌నుష్ 50వ సినిమా టైటిల్ ఫిక్స్‌.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌

అర్జున్ సినిమాలో నటించనని తను చెప్పలేదని, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఒకరోజు ఆపమని మాత్రమే అర్జున్‌ను రిక్వెస్ట్ చేసానని విశ్వక్ సేన్ అన్నారు. ఆ టైమ్‌లో అర్జున్ తమ ఇంటికి వచ్చిన తన పేరెంట్స్‌ని కూడా రిక్వెస్ట్ చేసారని ఈ విషయాలు ఎవరికీ తెలీదని అన్నారు. తనకు సినిమా నేపథ్యం లేదనో.. ఇంకేదో కారణాలతో మీడియా సమావేశం కూడా పెట్టారని ఆయన మీద గౌరవంతో ఈ ఇష్యూని పెంచకుండా రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేసానని విశ్వక్ సేన్ చెప్పారు. నాపై కావాలని ఆయన చేసిన గొడవ వల్ల తాను చాలా ఎక్కువగా నష్టపోయానని తాజా ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ చెప్పడం వైరల్ అవుతోంది.