Miss World 2024 : మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి భారత్ నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఈసారి ఇండియాలో జరగబోతోంది. మార్చిలో ముంబయిలో జరగబోతున్న ఈ వేడుకలో భారతదేశం నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

Miss World 2024 : మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి భారత్ నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

Missworld 2024

Miss World 2024 : 28 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు భారతదేశంలో జరుగుతాయి. భారత్ తరపున కన్నడ బ్యూటీ  సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీల్లో బరిలోకి దిగుతున్నారు.

మిస్ వరల్డ్ 71 ఎడిషన్ భారత్  వేదికగా జరగబోతోంది. భారత్ 1996 లో చివరి సారిగా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. కాగా ఈసారి మిస్ వరల్డ్ పోటీలలో ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత అయిన సినీ శెట్టి బరిలోకి దిగుతున్నారు. దాదాపుగా 120 దేశాల నుండి అందాల భామలు పోటీ పడుతున్నారు.  తాజాగా ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాజీ ప్రపంచ సుందరి పోలాండ్‌కి చెందినకరోలినా బిలావ్స్కా, మాజీ విజేతలు టోనీ ఆన్ సింగ్, వెనెస్సా పోన్స్ డి లియోన్ మరియు భారతదేశానికి చెందిన మానుషి చిల్లార్ హాజరయ్యారు.

Janhvi Kapoor : ముత్యాల డ్రెస్సులో జాన్వీ పాప పరువాలు..

అయితే ఈసారి మిస్ వరల్డ్ పోటీలలో ఇండియా తరపున ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత అయిన సినీ శెట్టి పోటీకి దిగుతున్నారు.. అకౌంటింగ్‌తో పాటు ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదువుకున్న సినీ శెట్టి భారతదేశం తరపున తనకు అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన సినీ శెట్టి  1.4 బిలియన్ల ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. ఇది తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భావాలకు, భావోద్వేగాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ వేదిక ద్వారా అనుకున్నది సాధిస్తానని సినీ శెట్టి చెప్పారు.

Pooja Hegde : చీరలో పుత్తడిబొమ్మలా మైమరపిస్తున్న పూజా అందాలు..

1996 లో మిస్ యూనివర్స్ పోటీలు బెంగళూరులో జరిగాయి. ఈ పోటీలు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహణలో జరిగాయి.  అప్పుడు 130 దేశాలకు చెందిన బ్యూటీలు పాల్గొన్నారు. ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ఆరుగురు మహిళలు మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1966 లో మొదటిసారి రీటా ఫారియా ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ టైటిల్ భారతదేశానికి తీసుకువచ్చారు. 1994 ఐశ్వర్యా రాయ్, 1997 లో డయానా హేడెన్, 1999 లో యుక్తా ముఖి మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందాలు. 2006 లో ప్రియాంక చోప్రా, 2017 లో మానుషి చిల్లర్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ వేడుకలను 1951 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. అప్పట్లో ఆయన టెలివిజన్ హోస్ట్‌గా ఉన్నారు. ఎరిక్ మోర్లీ ద్వారా ఈ పోటీలకు విపరీతమైన ప్రచారం వచ్చింది. అప్పటి నుండి ఏటా ఈ పోటీలు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sini Shetty (@sinishettyy)

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)