Vishwak Sen : లేడీ గెటప్ వేయబోతున్న విశ్వక్ సేన్.. ఆ సినిమా కోసం..

గామి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చెప్పాడు.

Vishwak Sen : లేడీ గెటప్ వేయబోతున్న విశ్వక్ సేన్.. ఆ సినిమా కోసం..

Vishwak Sen doing a Comedy Entertainment Movie with Lady Getup

Vishwak Sen : ఓ పక్క కొత్త కథలతో ప్రయోగాలు, మరో పక్క కమర్షియాలు సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ పేరు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. త్వరలో మార్చ్ 8న ‘గామి'(Gaami) అనే ప్రయోగాత్మక సినిమాతో రాబోతున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చెప్పాడు.

విశ్వక్ సేన్ ఇప్పుడు గామి సినిమాతో రావుతున్నాడు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో రాబోతున్నాడు. నెక్స్ట్ మెకానిక్ రాకీ అనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ‘లైలా’ అనే ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నాడు. ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అమ్మాయిగా నటించబోతున్నాడట. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా విశ్వక్ లేడీ గెటప్ లోనే కనిపిస్తాడట. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Mani Sharma : వామ్మో.. ఇంద్ర సినిమాకు మణిశర్మకి రెమ్యునరేషన్ అంతా? ఆ రికార్డ్ సెట్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..

గతంలో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, కమల్ హాసన్, మనోజ్, నరేష్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలు సైతం లేడీ గెటప్స్ వేసి మెప్పించారు. ఇప్పుడు అదే బాటలో విశ్వక్ సేన్ కూడా లేడీ గెటప్ వేసి ప్రేక్షకులని నవ్వించబోతున్నాడట. మరి లైలా సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.