Mani Sharma : వామ్మో.. ఇంద్ర సినిమాకు మణిశర్మకి రెమ్యునరేషన్ అంతా? ఆ రికార్డ్ సెట్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..

మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

Mani Sharma : వామ్మో.. ఇంద్ర సినిమాకు మణిశర్మకి రెమ్యునరేషన్ అంతా? ఆ రికార్డ్ సెట్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..

Music Director Mani Sharma Creates Record with Indra Movie Remuneration

Mani Sharma : ఎన్నో వందల అద్భుతమైన పాటలతో, ప్రతి హీరోకి మర్చిపోలేని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మణిశర్మ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. ముఖ్యంగా తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మెప్పించి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరికీ వాళ్ళ కెరీర్ లో ఎన్నో బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు మణిశర్మ. కానీ ప్రస్తుతం మణిశర్మకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. చాలా రేర్ గా తక్కువ సినిమాలు చేస్తూ గడిపేస్తున్నారు.

తాజాగా మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. మణిశర్మ మాట్లాడుతూ.. అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ కి అంత రెమ్యునరేషన్స్ ఉండేవి కావు. కమర్షియల్ సినిమాలు చేసే వాళ్ళకి మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటాయి. నా కెరీర్ లో ఇంద్ర సినిమాకి మొదటిసారి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఆ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్స్ లో మొదట కోటి రూపాయలు తీసుకున్నది నేనే. కెరీర్ స్టార్టింగ్ లో చూడాలని ఉంది సినిమాకు రెండున్నర లక్షలు తీసుకున్నాను. అప్పటినుంచి కష్టపడి కోటి రూపాయలకు ఎదిగాను. నేను కోటి రూపాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కి కోట్లలో రెమ్యునరేషన్ ఈజీ అయింది అని తెలిపారు.

Also Read : Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి ట్రైలర్ రిలీజ్.. సామాన్యుల కథలే అంటూ..

దీంతో ఇరవై ఏళ్ళ క్రితమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంద్ర మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఎంతిచ్చినా తక్కువే అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి కాబట్టి. ఇక ప్రస్తుతం అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రతి సినిమాకు కోట్లలోనే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.