Vishwak sen interesting comments about balakrishna and ntr.
Vishwak Sen: టాలీవడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఫంకీ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. అనుదీప్ స్టయిల్లో ఉన్న పంచులు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో నవ్విస్తున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో విశ్వక్ సేన్(Vishwak Sen). ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ తనకు ఒక విషయంలో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు.
Ram Pothineni: కలం పడుతున్న రామ్.. స్వయంగా తానే దిగుతున్నాడు. ఈసారి టార్గెట్ మిస్ అవదట!
“నా గత సినిమా లైలా. నేను ఆ సినిమాలో లేడీ పాత్రలో కనిపిస్తాను. నిజానికి, దర్శకుడు రామ్ నారాయణ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉంది, ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు కదా నేను చేస్తే ఒక కొత్త ప్రయత్నం అవుతుంది అనుకున్నాను. కానీ, ఫైనల్ గా సినిమా క్రింజ్ గా మారింది. ఆడియన్స్ అసలు ఈ సినిమా చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఇక ఆ సినిమా చూసి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ ఫోన్ చేసి ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.
ఇక విశ్వక్ సేన్ బాలకృష్ణ, ఎన్టీఆర్ తో ఎంత క్లోజ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చనువుతోనే బాలకృష్ణ, ఎన్టీఆర్ విశ్వక్ మంచి కోరి అలా చెప్పడారట. దీంతో విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విశ్వక్ సేన్ తరువాతి సినిమాల విషయానికి వస్తే, ఫంకీ సినిమా తరువాత విశ్వక్ సేన్ కల్ట్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.