Vishwak Sen: హిస్టరీ కియేట్ చేయబోతున్న విశ్వక్ సేన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
కల్ట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్న విశ్వక్ సేన్(Vishwak Sen).
- V Santhosh Kumar
- Published On : February 21, 2026 / 03:18 PM IST
Vishwak Sen is introducing 40 new actors to industry with cult film
Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. కెరీర్ మొదట్లో మంచి విజయాలు అందుకున్న ఈ నటుడు కొంతకాలంగా వరుసగా ప్లాప్స్ బాట పట్టాడు. ఈ హీరో, రీసెంట్ గా చేసిన ఒక్క కూడా హిట్ అవడం లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన ఫంకీ సినిమా కూడా ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్. కానీ, ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.
ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమా రిలీజ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు ఈ హీరో. అదే కల్ట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎన్నడూ చూడనంత బోల్డ్ అండ్ వైలెంట్ కంటెంట్ తో ఈ సినిమా రానుంది అని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు స్వయంగా విశ్వక్ సేన్(Vishwak Sen) దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈయన గతంలో ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ లాంటి సినిమాలను తెరకెక్కించాడు.
Mega Combo: మెగా కాంబో మళ్ళీ సెట్.. భారీ మైథలాజికల్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇక చాలా కాలం తరువాత పక్కాగా హిట్ కొట్టడం కోసం ఆయన మళ్ళీ దర్శకత్వ భాద్యతలు తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విశ్వక్. కల్ట్ సినిమా కంటెంట్ పై కూడా విశ్వక్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని నమ్ముతున్నాడు. ఇక, తాజగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే, కల్ట్ సినిమా ద్వారా ఏకంగా 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేయబోతున్నాడు.
ఇలా ఒకే సినిమాతో ఏకంగా 40 మంది నటీనటులు పరిచయం అవడం అనేది ఇదో తొలిసారి అవడం విశేషం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది రికార్డ్స్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కల్ట్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బాసృర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
