Vishwak Sen: దేవర మేకర్స్ తో విశ్వక్ సేన్ కొత్త మూవీ షురూ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా మొదలుపెట్టిన విశ్వక్ సేన్(Vishwak Sen).

Vishwak Sen new movie has begun with Director Rajath ravishankar

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దాంతో, విశ్వక్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టి, తన మార్క్ ఎనర్జీతో కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.

Rajinikanth: ఈ డైరెక్టర్ కూడా చేతులెత్తేశాడట.. మొదలవకుండానే ఆగిపోయిన రజనీకాంత్ మూవీ

ఈ క్రమంలోనే ‘దేవ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రజత్ రవిశంకర్‌తో విశ్వక్ సేన్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. గ్లోబల్ హిట్ ‘దేవర’ను నిర్మించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కీలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. పెద్ద నిర్మాణ సంస్థ తోడవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి క్రేజ్ నెలకొంది.

యువసుధ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. రజత్ రవిశంకర్ శైలికి, విశ్వక్(Vishwak Sen) బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా రోమ్ కామ్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మాస్ కా దాస్, ఈ కొత్త సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని అభిమానులు ఆశిస్తున్నారు.