Spirit: ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది

ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.

Vivek oberoi first look released from spirit movie

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్(Spirit). మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు సందీప్ ప్రభాస్ సినిమా చేస్తుండటంతో స్పిరిట్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. దీంతో, స్పిరిట్ నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

Breaking: ఎన్నికలకు ముందు విజయ్ కు షాక్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సినిమాపై అంచనాలను కూడా ఒక రేంజ్ లో పెంచేసింది ఈ పోస్టర్. ఇప్పుడు తాజాగా స్పిరిట్ నుంచి మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఫిబ్రవరి 27న ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నోట్లో సిగార్, చేతిలో కట్టి పట్టుకొని పవర్ ఫుల్ గా ఉన్న వివేక్ ఒబెరాయ్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. దీంతో, ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ సర్ ప్రైజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పిరిట్ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.