×
Ad

Family Star : ఆ సమస్య గురించి దిల్ రాజుకి ముందే చెప్పి.. హెచ్చరించిన విజయ్ దేవరకొండ.. ఏంటది..!

ఆ సమస్య గురించి దిల్ రాజుకి ముందే చెప్పి హెచ్చరించిన విజయ్ దేవరకొండ. అది తెలుసుకున్న దిల్ రాజు కూడా షాక్ అయ్యారట.

  • Published On : April 7, 2024 / 03:44 PM IST

Vjiay Deverakonda warn Dil Raju about when start Family Star

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ వస్తుంది. సినిమా బాగున్నా ప్లాప్ అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇది ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ సమస్యని విజయ్ దేవరకొండ ముందుగానే పసిగట్టి దిల్ రాజుని హెచ్చరించారట. తనతో మూవీ చేయాలని దిల్ రాజు అనుకున్నప్పుడు, విజయ్, దిల్ రాజుతో ఇలా చెప్పారట.. “నాతో సినిమా చేస్తే ఒక సమస్య ఉంటుంది. ఒక బ్యాచ్ నా సినిమా పై నెగటివిటీ వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా” అని ప్రశ్నించారట.

Also read : Vijay Deverakonda : రష్మికతో కలిసి విజయ్ దుబాయ్‌ వెకేషన్‌.. వైరల్ అవుతున్న ఫొటో..

అది విన్న దిల్ రాజు.. ఏంటి ఇలా కూడా ఉంటాయా అని షాక్ అయ్యారట. ఒక హీరో సినిమా పై నెగటివిటీ వ్యాప్తి చేసే గ్రూప్ లు ఇండస్ట్రీలో ఉన్నాయట. నిజానికి ఇలాంటి పద్ధతి బాలీవుడ్ లో ఉందని అక్కడి స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే పద్ధతి టాలీవుడ్ లో కూడా వస్తుందని కొందరు చెబుతున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు.

ఇక ఈ సినిమా పై జరుగుతున్న నెగిటివిటీని ఆపడం కోసం నిర్మాత దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగారు. థియేటర్స్ వద్ద సినిమా చూసిన ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి రివ్యూలు అడిగి తెలుసుకొని.. వాటిని సినిమా చూడని ఆడియన్స్ కి తెలిసేలా చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీని తట్టుకొని ఫ్యామిలీ స్టార్ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.