What’s Up Naresh Glimpse: యూత్ ఫుల్ కంటెంట్ తో ‘వాట్స్ అప్ నరేష్’.. గ్లింప్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉందిగా
‘వాట్స్ అప్ నరేష్' మూవీ గ్లింప్స్(What’s Up Naresh Glimpse) రిలీజ్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : February 8, 2026 / 07:06 PM IST
Whats Up Naresh Glimpse movie glimpse released
- కావ్య కళ్యాణ్ రామ్, అన్వేష్ మైఖేల్ జంటగా ‘వాట్స్ అప్ నరేష్’
- గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్
- యూత్ ఫుల్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
What’s Up Naresh Glimpse: బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్, కొత్తపోరడు ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాట్స్ అప్ నరేష్’. దర్శకుడు సివి విశాల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సివివి సినిమా బ్యానర్ పై భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ అండ్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్(What’s Up Naresh Glimpse) రిలీజ్ చేసి చేశారు మేకర్స్. “ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా” అని హీరో చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పంచింది.
Riddhi Kumar: నాచే నాచే సాంగ్ లో రిద్దీ హాట్ అందాలు.. ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ
ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే’ అనే సాంగ్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి.
ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇంకా ఈ సినిమాకి ఎడిటర్‌గా విప్లవ్ నైషదం, కెమెరామెన్‌గా వేదరామన్ శంకరన్ పని చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్ రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
