Rajinikanth : రజినీకాంత్ తో తమిళ తంబీల కోరిక నెరవేరుతుందా..? అందని ద్రాక్ష అందుతుందా..?

కోలీవుడ్‌కి మాత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల సినిమా అనేది ఇప్పటికి తీరని కలగానే మారిపోయింది. (Rajinikanth)

  • Published on- October 29, 2026 / 11:20 AM IST

Rajinikanth

Rajinikanth : కోలీవుడ్‌కి ఎంతో కాలంగా అందని ద్రాక్షగా ఉన్న ఆ వెయ్యి కోట్ల కలని రజనీకాంత్ జైలర్ సీక్వెల్‌తో నిజం చేయబోతున్నారా అనే చర్చ జరుగుతుంది. పాన్‌ ఇండియా ట్రెండ్‌లో అన్ని మేజర్‌ ఇండస్ట్రీలు ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్‌ని టచ్‌ చేశాయి. బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి ఈ టాలీవుడ్‌ సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద థౌంసడ్‌వాలాని పేల్చాయి. KGF 2తో శాండిల్‌ వుడ్‌, ఇక ధురంధర్ ది రివేంజ్, జవాన్‌, పఠాన్‌ సినిమాలతో బాలీవుడ్‌ మేకర్స్ సైతం వెయ్యి కోట్ల వసూళ్లు సాధించారు.

అయితే ఈ విషయంలో కోలీవుడ్‌కి మాత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల సినిమా అనేది ఇప్పటికి తీరని కలగానే మారిపోయింది. అయితే ఈ అరుదైన రికార్డ్‌ని జైలర్‌2తో రజనీకాంత్‌ నిజం చేసి చూపిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది కోలీవుడ్. రజనీకాంత్‌-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో 2.0 సినిమా వసూళ్లు వెయ్యి కోట్ల దిశగా వెళ్లినా.. చివరికి 750 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అయితే జైలర్‌ ఫస్ట్‌ పార్ట్ 600 కోట్లకిపైగా కలెక్ట్‌ చేయడంతో వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ టాపిక్‌ కోలీవుడ్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

Also See : Shravani Reddy : రుద్రవనం PS సిరీస్ ఈవెంట్.. చీరకట్టులో శ్రావణి రెడ్డి..

లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో భారీ స్టార్‌కాస్ట్‌తో వచ్చిన కూలీ సినిమా ఈ రికార్డ్‌ని టచ్‌ చేస్తుందనుకుంటే.. జైలర్‌ పార్ట్‌ 1ని కూడా అది రీచ్‌ అవ్వలేదు. 514 కోట్లు మాత్రమే రాబట్టింది రజనీ కూలీ సినిమా. ఇక కోలీవుడ్‌కి థౌసండ్‌ వాలా అందని ద్రాక్ష అని ఫిక్సయిన టైమ్‌లో.. మళ్లీ జైలర్ 2తో బిగ్‌ హోప్స్‌ లోడ్‌ చేస్తున్నారు తలైవా

దసరా సందర్భంగా అక్టోబర్ 15న థియేటర్స్‌లోకి వచ్చిన రజనీకాంత్ జైలర్‌ 2 సినిమా ప్రజెంట్‌ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. కోలీవుడ్‌ మెగా ఇండస్ట్రీ బ్లాక్‌బాస్టర్‌గా అన్ని రికార్డుల్ని బ్రేక్‌ చేసిన రజనీకాంత్‌.. కేవలం 13 రోజుల్లోనే 744 కోట్లు రాబట్టారు. ఈ వారం తమిళ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సినిమాల విడుదల లేకపోవడంతో జైలర్ 2కి మరింతగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ దీపావళిలోగా జైలర్ 2తో రజనీకాంత్‌ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తారా? తమిళ తంబీల ఆశల్ని తలైవా ఎంతవరకు నిజం చేస్తారో ఎదురు చూడాలి.