Oscar Awards : ఆస్కార్ వేడుకల్లో ఊహించని సంఘటన.. కమెడియన్‌ని కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్‌స్మిత్
94వ ఆస్కార్ వేడుకల్లో అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కారు. అతను మాట్లాడుతూ మధ్యలో విల్ స్మిత్ భార్య.........
- Saketh U
- Published on- March 28, 2022 / 10:37 AM IST
Will Smith
Oscar Awards : 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానం నిన్న రాత్రి మార్చ్ 27న జరిగింది. ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డులకు అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక అయింది. అయితే ఈ సారి ఆస్కార్ అవార్డు వేడుకల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఈ సారి ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ ఆస్కార్ దక్కించుకున్నారు. ఈ వేడుకల్లో అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ ని బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న విల్ స్మిత్ లాగిపెట్టి చెంప మీద కొట్టాడు.
వివరాల్లోకి వెళితే.. 94వ ఆస్కార్ వేడుకల్లో అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కారు. అతను మాట్లాడుతూ మధ్యలో విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ పై జోక్ చేశాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా, ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా ఎంజాయ్ చేస్తున్న విల్ స్మిత్ కోపం తెచ్చుకొని కూర్చున్న చోటు నుంచి లేచి స్టేజిమీదకి వెళ్లి క్రిస్ ని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
Oscar Awards : 94వ ఆస్కార్ విజేతలు వీరే.. ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం
క్రిస్ ని కొట్టేసి విల్ స్మిత్ కిందకి దిగుతుంటే క్రిస్ నవ్వుతూ ఆ జోక్ కి వివరణ ఇవ్వబోయాడు. అంతలో స్మిత్ నోరు మూసుకో అంటూ తిట్టాడు. అయితే ఈ వీడియో లైవ్ ఈవెంట్ లో ప్లే అవ్వలేదు, కానీ వీడియో మాత్రం బయటకి వచ్చింది. ఆ తర్వాత అవార్డు నిర్వాహకులు విల్ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్ది చెప్పారు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక చివర్లో ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న విల్ స్మిత్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో క్రిస్ ని కొట్టినందుకు, అతని పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియచేయడం విశేషం. ఇప్పుడు విల్ స్మిత్ కమెడియన్ క్రిస్ ని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
