Yash : భార్యా పిల్లలతో సముద్రం బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తున్న యశ్.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇమ్మని ఫ్యాన్స్..
ఇటీవల ఏ పండగ వచ్చినా యశ్ తన భార్య రాధికా, పిల్లలతో మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా యశ్ తన భార్యాపిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు.
- Saketh U
- Published On : September 11, 2023 / 07:31 AM IST
Yash Enjoying Vacation with wife Radhika Pandit and his Childrens
Yash : కేజిఎఫ్ 2(KGF 2) సినిమా వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇంకా యశ్ దగ్గర్నుంచి తన నెక్స్ట్ సినిమా అప్డేట్ రాలేదు. యశ్ అభిమానులతో పాటలు, ప్రేక్షకులు కూడా అంత భారీ సినిమాలు చేసిన తర్వాత యశ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని భావిస్తున్నారు. కానీ యశ్ మాత్రం అసలు సినిమాల గురించి పట్టించుకోకుండా ఫ్యామిలీకి ఫుల్ టైం ఇచ్చేస్తున్నాడు.
ఇటీవల ఏ పండగ వచ్చినా యశ్ తన భార్య రాధికా, పిల్లలతో మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా యశ్ తన భార్యాపిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో చెప్పకపోయినా సముద్రం, బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. బీచ్ లో ఇసుకపై భార్య రాధికతో కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు యశ్.
Bigg Boss 7 Day 7 : ఊహించినట్టు తనే మొదటి ఎలిమినేషన్.. సండే హైలెట్స్.
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో కింద కూడా అభిమానులు యశ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇమ్మని అడుగుతున్నారు. మరి యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.
