Toxic : వాట్.. ‘టాక్సిక్’ అడల్ట్ సినిమా కాదా? బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమానా? యశ్ ఏం చెప్పాడంటే..

తాజాగా యశ్ ఈ సినిమా కథ గురించి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు.(Toxic)

  • Published on- July 16, 2026 / 10:36 AM IST

Toxic

Toxic : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్ తో ఈ సినిమా అడల్ట్ సినిమా, గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకుంటున్నారు అంతా. అసలు ఇటీవల వచ్చిన తబాయి సాంగ్, లేడీస్ గ్లింప్స్ తో ఈ సినిమాకు కచ్చితంగా A సర్టిఫికెట్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు అంతా. కొంతమంది అయితే ఇదేదో అడల్ట్ మూవీ, ఫ్యామిలీస్ తో చూడటం కష్టం అని ఫిక్స్ అయిపోయారు.

అయితే తాజాగా యశ్ ఈ సినిమా కథ గురించి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Hema : కొత్త కారు కొన్న నటి హేమ.. వామ్మో ఈ కారు ధర ఎన్ని కోట్లు అంటే..?

యశ్ టాక్సిక్ సినిమా గురించి మాట్లాడుతూ.. 1947లో స్వతంత్రం వచ్చినా మన ఇండియాలో ఇంకా కొన్ని ప్రాంతాలు 1961 వరకు పోర్చ్ గ్రీస్, ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ సమయంలో జరిగిన ఓ బిజినెస్ కి సంబంధించిన కథ ఇది. ఇందులో పోర్చ్ గ్రీస్ వాళ్ళు, ఇండియన్స్ ఉంటారు. అధికారం కోసం జరిగే గ్యాంగ్ స్టర్ కథ ఇది. కానీ ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, తండ్రి కొడుకు రివెంజ్ కథ. ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉంది అని తెలిపాడు.

దీంతో టాక్సిక్ సినిమాలో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ ఉన్నారు. వీళ్ళలో కియారా అద్వానీ యశ్ లవర్ పాత్రలో కనిపిస్తుందని ఇటీవల తబాయి సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. మరి యశ్ కి సిస్టర్ పాత్రలో నటించేది నలుగురిలో ఏ హీరోయిన్? లేదా ఇంకెవరైనా ఉన్నారా అని చర్చ జరుగుతుంది. మొత్తానికి అడల్ట్ సినిమా అనుకున్న టాక్సిక్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, తండ్రి కొడుకు రివెంజ్ కథ అని చెప్పడంతో మాములు ఆడియన్స్ కూడా ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.