NTR – Yash : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కంటే ముందే.. ‘టాక్సిక్’లో దాని గురించి చెప్పేసిన యశ్..
యశ్ కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని టాక్సిక్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. (NTR - Yash)
- Saketh U
- Published on- August 27, 2026 / 07:14 AM IST
NTR - Yash
NTR – Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక కారణాలతో, ఎన్టీఆర్ కి అయిన గాయాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఇటీవల ఓ మూడు నెలల క్రితం డ్రాగన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో డ్రాగన్ సినిమా అంతా.. ఓపియం అనే డ్రగ్ చుట్టూ తిరుగుతుందని చూపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓపియం డ్రగ్ కోసం రెండు కంపెనీల మధ్య గొడవలు జరిగాయని చూపించారు.
యశ్ కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని టాక్సిక్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజయిన ఈ భారీ సినిమా మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే టాక్సిక్ సినిమాలో ఈ ఓపియం డ్రగ్ గురించి చూపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఓపియం బిజినెస్ ని దాని కోసం జరిగిన గొడవలతో కొన్ని సీన్స్ ని చూపించారు. యశ్ ఆ బిజినెస్ చేసిన రాయ పాత్రలో కనిపించాడు.
Also See : Navya Swamy : కేరళ గురువాయూర్ ఆలయంలో.. సీరియల్ నటి నవ్యస్వామి ఓనం సెలబ్రేషన్స్..
దీంతో ఓపియం కథని ఎన్టీఆర్ డ్రాగన్ కంటే ముందే యశ్ చెప్పేసాడు. అయితే టాక్సిక్ సినిమాలో ఓపియం కథ కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమయింది. కానీ డ్రాగన్ లో కథ మొత్తం ఓపియం చుట్టే తిరుగుతుంది. ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఈ ఓపియం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తిగా కనిపించనున్నాడు. దీంతో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఓపియం గురించి ఇంకేం చూపిస్తారో అని ఆసక్తి నెలకొంది.
