Toxic : ఆగ‌స్టులో రిలీజ్ కానున్న టాక్సిక్‌.. ఏ రోజున అంటే?

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్‌ (Toxic) న‌టిస్తున్న టాక్సిక్ చిత్రం కొత్త విడుద‌ల తేదీని మూవీ యూనిట్ వెల్ల‌డించింది.

Yash Toxic movie Release on august 26th 2026

Toxic : క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్‌ న‌టిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ప‌లుమార్లు ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది.

ఈ చిత్రాన్ని 2026 ఆగ‌స్టు 26న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో ఓ స్పెష‌ల్ పోస్టర్‌ను పంచుకుంది.

Manchu Lakshmi : హ్యాపీ ఫాద‌ర్స్ డే అంటూ స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మి

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రుక్మిణి వ‌సంత్‌, న‌య‌న‌తార‌, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతారియా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి యష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Varshini : బీచ్‌లో వ‌ర్షిణి హోయ‌లు.. అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న యాంక‌ర్‌..