×
Ad

Toxic: టాక్సిక్ మూవీ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. కన్ఫ్యూజన్ లో యష్ ఫ్యాన్స్

యష్ టాక్సిక్(Toxic) సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Yash toxic movie release on march 19th

  • ఒకేరోజు వస్తున్న దురంధర్ 2, టాక్సిక్
  • టాక్సిక్ వాయిదా పడుతుందంటూ వార్తలు
  • క్లారిటీ ఇచ్చిన టాక్సిక్ మేకర్స్

Toxic: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ విజయం తరువాత చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని యష్ ఈ సినిమాను చేస్తున్నాడు. అందుకే, టాక్సిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో, సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది అంటూ ఈగర్ గా సినిమా విడుదల కోసం చూస్తున్నారు యష్ ఫ్యాన్స్. ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, గత వారం రోజుల నుంచి టాక్సిక్(Toxic) సినిమా వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దానికి కారణం బాలీవుడ్ సెన్సేషన్ ధురంధర్ 2 మూవీ.

Nithin: హిట్ డైరెక్టర్ కి సూపర్ ఛాన్స్.. మరో సినిమాను ఒకే చేసిన నితిన్

అవును, రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సింగల్ లాన్గ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై మూవీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా దురంధర్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, దురంధర్ సినిమా కూడా మార్చ్ 19న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో, ఇండియన్ సినీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ కి రంగం సిద్ధం అయ్యింది.

అయితే, ఈ నేపధ్యంలోనే యష్ టాక్సిక్ సినిమా వాయిదా పడనుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఆ వార్తలపై మేకర్స్ స్పందించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి కారణాల వల్ల కూడా టాక్సిక్ సినిమా వాయిదా పడే అవకాశమే లేదు అని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో టాక్సిక్ వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. కాబట్టి, మార్చ్ 19న బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధం అయినట్టే. మరి ఈ భారీ క్లాష్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మార్చ్ 19వరకు ఆగాల్సిందే.