Toxic Twitter Review : టాక్సిక్ ట్విట్ట‌ర్ రివ్యూ.. య‌శ్ అద‌ర‌గొట్టాడు.. కానీ..?

యశ్ నటించిన టాక్సిక్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీని చూసిన వారు సోషల్ మీడియా వేదికగా (Toxic Twitter Review)తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Yash Toxic movie Twitter Review

Toxic Twitter Review : రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. న‌య‌న‌తార‌, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వి బ్ర‌సూర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు (బుధ‌వారం ఆగ‌స్టు 26) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

కేజీఎఫ్ చిత్రాల త‌రువాత య‌శ్ న‌టించిన మూవీ కావంతో టాక్సిక్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోలు, ఎర్లీ స్ర్కీనింగ్స్ షోలు ప‌డ్డాయి. ఇక ఈ మూవీని వీక్షించిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.

Madonna Sebastian : ఓన‌మ్ స్పెష‌ల్.. కేర‌ళ చీర‌క‌ట్టులో మడోన్నా సెబాస్టియన్..

కొంద‌రు ఈ సినిమా అదిరిపోయింద‌ని, య‌శ్ ఇర‌గ‌దీశాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. యశ్‌ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంద‌ని చెబుతున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ అని అంటున్నారు. ఇంకొంద‌రు మాత్రం బాగాలేద‌ని చెబుతున్నారు. ఫ‌స్టాఫ్ అంతా గంద‌ర‌గోళంగా ఉంద‌ని, పాత్రల ప‌రిచయం స‌రిగా లేద‌ని అంటున్నారు. మూడు గంట‌లకు పైగా ర‌న్‌టైమ్ ఉండ‌డంతో కొంత మంది మైన‌స్‌గా అని అంటున్నారు.