Toxic Pre Release Event : ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో.. ఎప్పుడు? ఎక్కడ?
టాక్సిక్ సినిమా ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. (Toxic Pre Release Event)
- Saketh U
- Published on- August 19, 2026 / 03:44 PM IST
Toxic Pre Release Event
Toxic Pre Release Event : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తో హైప్ నెలకొంది. 1980 పీరియాడిక్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రానుంది.
టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఇటీవల బెంగళూరులో ఘనంగా నిర్వహించగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. యశ్ టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆగస్టు 22 శనివారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది.
Also See : Iswarya Menon : ఓనం వచ్చేస్తుంది.. చీరలో ఐశ్వర్య మీనన్.. ఎంత ముద్దుగా ఉందో..
దీంతో యశ్ ని చూడటానికి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. యశ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
It's Time. He's Coming!💥💥💥
Hyderabad is about get Intoxicated!❤️🔥#ToxicTheMovie Pre-Release Event
📍Malla Reddy University, Hyderabad
22nd August | 5 PM Onwards#ToxicOn26thAug pic.twitter.com/MsapzfsFWu— KVN Productions (@KvnProductions) August 19, 2026
