×
Ad

Yatra 2 : జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా ?

ప్రస్తుతం యాత్ర 2 శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక యాత్ర 2 సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

  • Published On : October 27, 2023 / 12:13 PM IST

Yatra 2 Movie Chandrababu Naidu Role play by Bollywood Senior Actor

Yatra 2 Movie : గతంలో 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాక జగన్ కి కూడా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’.

ఈ సినిమాలో వైఎస్సార్ మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, జగన్ సీఎం ఎలా అయ్యాడు అనే దానిపై సినిమా ఉండబోతుందని సమాచారం. మొదటి పార్ట్ లో వైఎస్సార్ గా నటించిన మమ్ముట్టి(Mammootty) ఈ పార్ట్ లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా(Jiiva) నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక యాత్ర 2 సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో అప్పటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉంటాయని తెలిసిందే. అయితే ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితుల్లో యాత్ర 2 సినిమాలో చంద్రబాబు(Chandrababu Naidu) పాత్ర ఎవరు పోషించబోతున్నారు అని అంతా చర్చించుకుంటున్నారు. యాత్ర 2 సినిమాలో చంద్రబాబు పాత్రని బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నాడని టాలీవుడ్ సమాచారం. దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా ఆల్రెడీ మహేష్ మంజ్రేకర్ యాత్ర 2 షూటింగ్ లో పాల్గొన్నాడని తెలుస్తుంది.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లియో సినిమాలో ఉన్నాడా? వికీపీడియా ఇన్ఫర్మేషన్ నిజమేనా?

బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ హిందీతో పాటు సౌత్ లో కూడా పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. తెలుగులో డాన్ సీన్, అదుర్స్, ఒక్కడున్నాడు, అఖిల్, వినయ విధేయ రామ.. లాంటి పలు సినిమాల్లో మెప్పించాడు. ఇక మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు, హిందీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.