‘ఎవత్తివే’ లిరికల్ సాంగ్

రీసెంట్‌గా హిప్పీ మూవీ నుండి 'ఎవత్తివే' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Publish Date - May 14, 2019 / 09:33 AM IST

రీసెంట్‌గా హిప్పీ మూవీ నుండి ‘ఎవత్తివే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ఆర్‌‌ఎక్స్ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరో లేదా విలన్ రోల్ ఏదైనా రెడీ అంటున్నాడు. ప్రస్తుతం కార్తికేయ హీరోగా, వి క్రియేషన్స్ బ్యానర్‌పై, ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మాణంలో, టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న సినిమా.. హిప్పీ.. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్స్ కాగా, సీనియర్ నటుడు జె.డి.చక్రవర్తి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. హిప్పీలో సరికొత్త గెటప్‌, డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు కార్తికేయ. హిప్పీ టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

రీసెంట్‌గా ఈ మూవీ నుండి ‘ఎవత్తివే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ‘ఎవత్తివే, ఎవత్తివే, ఎదనిపట్టీ వదలవే’.. అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. నివాస్ కె.ప్రసన్న ట్యూన్‌కి, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, కార్తీక్, నివాస్ కె.ప్రసన్న కలిసి పాడారు. చక్కటి పదాలతో కూల్‌గా ఉందీ పాట.. త్వరలో హిప్పీ రిలీజ్ కానుంది. హరితేజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్, డైలాగ్స్ : టి.ఎన్.కృష్ణ, కాశి రాజు, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : బృంద, శోభి, ఆర్ట్ : మిలాన్..

వాచ్ ఎవత్తివే లిరికల్ సాంగ్..