Young Hero : ఒకప్పుడు టీవీలో ఆ షోకి స్కిట్స్ రాసి.. ఇప్పుడు హిట్స్‌తో దూసుకుపోతున్న యువ హీరో..
తాజాగా ఓ యువ హీరో ఒకప్పుడు టీవీలో రైటర్ గా చేసానని చెప్పుకొచ్చాడు. (Young Hero)
- Saketh U
- Updated on- July 14, 2026 / 01:13 PM IST
Young Hero
Young Hero : సినీ పరిశ్రమలో ఎదిగిన వాళ్లంతా ఒకప్పుడు కష్టపడ్డ వాళ్ళే. పరిశ్రమలోనే వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా పని చేసి ఉంటారు. తాజాగా ఓ యువ హీరో ఒకప్పుడు టీవీలో రైటర్ గా చేసానని చెప్పుకొచ్చాడు. ఆ యువ హీరో ఎవరో కాదు తిరువీర్.
నాటకాలు వేస్తూ కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్ బొమ్మలరామారం సినిమాతో నటుడిగా మారాడు. జార్జ్ రెడ్డి, టక్ జగదీశ్ సినిమాలతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ మసూద సినిమాతో పెద్ద హిట్ కొట్టి హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా పరేషాన్, ప్రీ వెడ్డింగ్ షూట్ సినిమాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్నాడు.
Also Read : Bhagyashri Borse : లెనిన్ హిట్ తర్వాత.. దేవకన్యలా మెరిసిపోతున్న భాగ్యశ్రీ భోర్సే.. ఫొటోలు..
ఇటీవల పాపం ప్రతాప్ సినిమాతో యావరేజ్ అనిపించినా ఇప్పుడు ఓ సుకుమారి సినిమాతో రాబోతున్నాడు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన ఓ సుకుమారి సినిమా జులై 17న రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా రైటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తిరువీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు సినీ పరిశ్రమలో రైటర్స్ లేరు. రచయితలే దర్శకులు అవుతున్నారు. నేను ఒకప్పుడు నాటకాలకు రాసేవాడిని. నేనే డైరెక్ట్ చేసేవాడిని. డ్రామా జూనియర్స్ షోలో నేను స్కిట్స్ కూడా రాసాను. ఆ షోకి రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసాను. అలా స్కిట్స్ రాయగలను కానీ సినిమాలకు నేను రాయలేను. మహా అయితే సినిమా కథకు సినాప్సిస్ రాస్తానేమో. అంతకు మించి నేను సినిమా కథ రాయలేను. కానీ దర్శకులతో కథా చర్చల్లో పాల్గొంటాను అని తెలిపాడు.
తిరువీర్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు పెళ్లి చేసుకొని పండంటి బాబుకు తండ్రయి ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
