రూపేష్ పోలీస్‌గా బాగున్నాడు – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
‘22’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
- sekhar
- Published on- February 22, 2020 / 07:31 AM IST
‘22’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్..‘22’.. పూరి జగన్నాథ్, వి.వినాయక్, మారుతి వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో, మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల పూరి ఫస్ట్ లుక్, నాగార్జున టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా ‘22’ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ‘మార్ మార్ కే జీనా హై’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. మ్యూజిక్ బైట్ చూసి ప్రభాస్ చాలా బాగుందని టీమ్‌ను విష్ చేసి, ‘22’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలని చెప్పారు. విక్రమ్జీత్విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీ నాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్తరుణ్, మాస్టర్దేవాన్ష్, బేబి ఓజల్తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం : సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్వాడవల్లి, కొరియోగ్రఫీ : అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్ : భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చీఫ్కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత : శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : శివకుమార్ బి.
Read More>> నా వల్ల ‘గతం’ మర్చిపోయి.. నా ఇంటికే వచ్చారు..
See Also>>సెన్సార్ కట్స్ చెప్పింది – రివైజ్ కమిటీ రిలీజ్ చేసుకోమంది..
