YS Jagan : వైఎస్ జగన్ తో స్టార్ హీరోలు సూర్య, కార్తీ మీటింగ్.. సూర్యని హత్తుకున్న జగన్.. వీడియో వైరల్..
మాజీ సీఎం వైఎస్ జగన్ తమిళ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలిసిన వీడియో వైరల్ గా మారింది. (YS Jagan)
- Saketh U
- Published On : February 8, 2026 / 12:15 PM IST
YS Jagan
YS Jagan : తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ తమిళ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలిసిన వీడియో వైరల్ గా మారింది. జగన్ తన బంధువు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. వైయస్ సునీల్ రెడ్డి (వైయస్ జగన్ పెదనాన్న వైయస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడు సాహిల్ వివాహం చెన్నైలో నేడు జరుగుతుంది.(YS Jagan)
ఈ వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇదే వివాహానికి తమిళనాడులోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరోలు కార్తీ, సూర్య కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహమండపంలో జగన్ ని సూర్య, కార్తీలు పలకరించారు. సూర్య, కార్తీలను జగన్ హత్తుకున్నారు. వీరు ముగ్గురు కాసేపు మాటాడుకున్నారు.
Also Read : Supritha : అమ్మ మీద డ్రగ్స్, నా మీద బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు.. అమ్మకు ఏమైనా అయితే.. ఎమోషనల్ అయిన సుప్రీత..
జగన్, సూర్య, కార్తీ ముగ్గురు కలిసి మాట్లాడిన వీడియోని ప్రస్తుతం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..
#suriya Anna exclusive video ❤️pic.twitter.com/fiux1lVZea
— S.A (@Suriyaisam) February 8, 2026
