Fake Driving Licences: ఫేక్ డ్రైవింగ్ లైసెన్సులు సబ్‌మిట్ చేసిన 12మంది పోలీసులు సస్పెండ్

డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీలో 14ఏళ్ల క్రితం సమర్పించిన డ్రైవింగ్ లైసెన్సులు ఫేక్ అని తెలియడంతో 12మంది పోలీసులను డిస్మిస్ చేశారు. 2007లో రిక్రూట్ అయిన కానిస్టేబుల్ (డ్రైవర్స్)...

Delhi Police

Fake Driving Licences: డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీలో 14ఏళ్ల క్రితం సమర్పించిన డ్రైవింగ్ లైసెన్సులు ఫేక్ అని తెలియడంతో 12మంది పోలీసులను డిస్మిస్ చేశారు. 2007లో రిక్రూట్ అయిన కానిస్టేబుల్ (డ్రైవర్స్) సంఖ్య దాదాపు 600మంది కంటే ఎక్కువగానే ఉంది.

ఈ రిక్రూట్మెంట్ స్కాం 2012లో బయటపడింది. సుల్తాన్ సింగ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ (డ్రైవర్ ) పోస్టుకు అప్లై చేశాడు. పోలీసులు అతని లైసెన్సును వెరిఫై చేయగా.. అది మధుర అధికారులు ఇష్యూ చేయలేదని తెలిసింది. సుల్తాన్ సింగ్ 2007లోనూ అదే పోస్టుకు అప్లై చేశాడు. రెండో సారి అప్లై చేయడం.. 2007లో సబ్‍మిట్ చేసిన వారి లైసెన్సులు మరోసారి చెక్ చేసే ఉద్దేశ్యంతో క్రైమ్ బ్రాంచ్ కు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత డాక్యుమెంట్లను మధుర రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ కు వెరిఫికేషన్ కోసం పంపారు. అప్పుడు కానీ, 2007లో రిక్రూట్మెంట్ ప్రోసెస్ లోనే మోసం జరిగిందని తెలియలేదు. ఫలితంగా ఢిల్లీలోని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 12మంది కానిస్టేబుల్స్ ను విధుల్లో నుంచి డిస్మిస్ చేశారు.

……………………………………. : రైతుల పట్ల గజినిగా మారిన సీఎం కేసీఆర్ : బండి సంజయ్