పోలీసుల ఎదుట లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు
- veegam team
- Published On : April 22, 2019 / 06:47 AM IST
మాయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ లో పలువురు మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ లోని బస్తర్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (ఏప్రిల్ 21)న 15మ మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోలు మూడు రైఫిళ్లను కూడా పోలీసులకు మావోయిస్టులు అప్పజెప్పారు.
కాగా లొంగిపోయిన మహిళా మావోయిస్ట్ పై ప్రభుత్వం గతంలో రూ.లక్ష రివార్డు ను ప్రకటించింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఈమె మావోయిస్టుల ‘చేతన నాట్య మండలి’ కి కమాండర్ గా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా లొంగిపోయిన ఈ మావోయిస్టులందరికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి.. ఉపాధి కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Bijapur: 15 Naxals surrendered before Bijapur SP, earlier today. #Chhattisgarh pic.twitter.com/WvW45Qoxnk
— ANI (@ANI) April 21, 2019
