వైభోగంగా గోవర్ధన పూజ : 3500 వంటకాలతో నైవేద్యం

  • Publish Date - October 29, 2019 / 02:42 AM IST

గుజరాత్‌లోని వడోదరలో గల స్వామినారాయణ్ ఆలయంలో అద్భతమైన వేడుక జరిగింది. చూడటానికి రెండు కళ్లూ చాలవు అన్నంత భోగంగా..సోమవారం ((అక్టోబరు 28)న ఘనంగా..కన్నుల పండుగగా జరిగింది గోవర్థన పూజ. స్వామి నారాయణ్ కు 3500 రకాల వంటకాలతో నైవేద్యాన్ని సమర్పించి ‘అన్నకూట్ పూజ’ నిర్వహించారు. దీన్నే ‘గోవర్ధన పూజ’ అని కూడా అంటారు. 

ఈ వేడకలో భాగంగా స్వామినారాయణ  పేరుతో వెలసిన బ్రహ్మాండనాయకుడు శ్రీ మహావిష్ణువుకు 3500 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు. ఈ నైవేద్యంలో కేకులు, స్వీట్లు మరియు డ్రైఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ నైవేద్యాలను భక్తులు చక్కగా అలంకరించారు.

వరుణుడి ఆగ్రహంతో భారీ వర్షాలు కురిసి గోకులం అంతా భారీ వర్షాల్లో మునిగిపోతున్న సమయంలో గోకులంలోని ప్రజలను, పశువులను ఆదుకోవటానికి శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన్ వేలుతో  ఎత్తి ప్రజలను రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు గోవర్ధనడుని స్మరిస్తూ దీపావళి వెళ్లిన రోజున ఈ పూజను నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.