×
Ad

Encounter : ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

  • Published On : June 19, 2022 / 09:22 PM IST

encounter

Encounter :  జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో భద్రతా దళాలు వీరిని ముట్టుబెట్టాయి. మరణించిన లాకిలో ఒకరు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అని… లష్కరే తోయిబా సంస్ధ కోసం పని చేస్తున్నాడని అధికారులు తెలిపారు.

షౌకత్ అహమ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా అతడిచ్చిన సమాచారంతో సైన్యం కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈక్రమంలో ఉగ్రవాదుల శిబిరాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.  ఈ నేపధ్యంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశాయి. ఈకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. లోలబ్ లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
మరోవైపు కుల్గాంజిల్లా దమ్హల్ హంజీపోరా ప్రాంతంలోనూ ఎదురు కాల్పుల జరిగాయి భద్రతా దళాలు ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Also Read : Job Vacancies : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా లక్షల ఉద్యోగాలు