Flights Wings Collide: రెండు విమానాలు ఢీ.. ముంబై ఎయిర్ పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఈ ప్రమాద ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
- Naveen
- Updated on- February 4, 2026 / 12:03 AM IST
Flights Wings Collide Representative Image (Image Credit To Original Source)
Flights Wings Collide: ముంబై ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో, ఎయిరిండియా విమానాల రెక్కలు ఢీకొన్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ఇండిగో విమానం, ముంబై నుంచి కోయంబత్తూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రెక్కలు ఢీకొన్నాయి.
రెండు విమానయాన సంస్థలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెండు విమానాల రెక్కలు ఢీకొన్నాయని, కొంత నష్టం జరిగిందని ధృవీకరించాయి. అదృష్టవశాత్తూ, ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రిలాక్స్ అయ్యారు.
తమ విమానం టేకాఫ్ కోసం టాక్సీవేలో వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఎయిర్ ఇండియా తెలిపింది. మరోవైపు, ఇండిగో విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ” ముంబై నుండి కోయంబత్తూరుకు నడిచే AI2732 విమానం ఆలస్యమైంది. ఆ విమానం టేకాఫ్‌కు ముందు టాక్సీవేపై వేచి ఉండగా మరొక ఎయిర్‌లైన్ విమానంతో ఢీకొనడంతో ఆలస్యమైంది. రెండు విమానాల రెక్కల చివరలు తాకాయి. ఫలితంగా మా విమానం రెక్కల చివర దెబ్బతింది” అని ఎయిర్ ఇండియా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
