Amit shah slams RahulGandhi: విదేశీ టీ-షర్టు వేసుకుని రాహుల్ బాబా యాత్ర చేస్తున్నారు.. మొదట ఈ పని చేయండి: అమిత్ షా సూచన

‘‘రాహుల్ బాబా విదేశీ టీ-షర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రకు వెళ్లేముందు ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. రాహుల్ బాబాతో పాటు కాంగ్రెస్ నేతలకు ఓ విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నాను. గతంలో రాహుల్ గాంధీ పార్లమెంటో మాట్లాడుతూ భారత్ ఒక దేశం కాదని అన్నారు. ఏ పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని చదివారు? లక్షలాది మంది ప్రజలు త్యాగాలు చేసిన దేశం ఇది. దేశాన్ని ఏకం చేస్తానంటూ రాహుల్ గాంధీ బయలుదేరారు. కానీ, ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాలి. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పనిచేయదు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది’’ అని అమిత్ షా అన్నారు. 

Amit shah slams nitish kumar

Amit shah slams RahulGandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇవాళ రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘రాహుల్ బాబా విదేశీ టీ-షర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రకు వెళ్లేముందు ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. రాహుల్ బాబాతో పాటు కాంగ్రెస్ నేతలకు ఓ విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు.

‘‘గతంలో రాహుల్ గాంధీ పార్లమెంటో మాట్లాడుతూ భారత్ ఒక దేశం కాదని అన్నారు. ఏ పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని చదివారు? లక్షలాది మంది ప్రజలు త్యాగాలు చేసిన దేశం ఇది. దేశాన్ని ఏకం చేస్తానంటూ రాహుల్ గాంధీ బయలుదేరారు. కానీ, ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాలి. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పనిచేయదు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.

కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ధరిస్తోన్న టీ-షర్టు చాలా ఖరీదైందని, విదేశాల నుంచి తెప్పించుకుని ధరిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి ఇటీవలే ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగియనుంది. దేశాన్ని ఏకం చేయడానికే తాను ఈ యాత్ర చేస్తున్నానని రాహుల్ గాంధీ అంటున్నారు.

EetelaRajender slams KCR: ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి నాయకత్వం వహిస్తానంటున్నారు: ఈటల