Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకి నోరూరించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ.. అందులో ఏమున్నాయంటే?
ఆనంద్ మహీంద్రా నోరూరించే బ్రేక్ ఫాస్ట్ మెనూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మెనూ వింటే మీకు వెంటనే అక్కడికి వెళ్లాలనిపిస్తుంది.
- Lakshmi 10tv
- Updated on- November 11, 2023 / 03:00 PM IST
Anand Mahindra
Anand Mahindra : హోటల్‌కి వెళ్లగానే ముందుగా మెనూ కార్డు చూస్తాం. లేదా వెయిటర్ చెప్పిన దాంట్లో నచ్చింది ఆర్డర్ చేసుకుంటాం. అక్కడ హోటల్‌కి జస్ట్ బ్రేక్ ఫాస్ట్‌కి వెళ్తే.. మెనూ లిస్టూ మామూలుగా ఉండదు. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకి సైతం నోరూరించిన ఆ హోటల్ ఎక్కడ ఉంది.. అసలు ఆ మెనూ కథా కమామీషు ఏంటి? చదవండి.
KTR Reply to Anand Mahindra : డియర్ ఆనంద్ జీ.. మీకు తెలుసా? అంటూ ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ రిప్లై
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు. ఆయన చూడాల్సిన టూరిస్ట్ స్పాట్ లిస్ట్‌లో ఆ ప్రాంతం కూడా చేరింది. అంతలా ఆకట్టుకునేలా అందులో ఏముంది? అంటే.. కర్నాటక ఉడిపిలోని రెస్టారెంట్లో ఓ వృద్ధుడు గుక్క తిప్పుకోకుండా బ్రేక్ ఫాస్ట్ మెనూ వివరిస్తూ కనిపించాడు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా’ ‘చాట్ GPT’ రూపొందించిన మెనూ కూడా ఇతని భారీ మెనూతో సరిపోలడం లేదు.. ఉడిపిలోని ‘శ్రీవిట్టల్ టీ కాఫీ హౌస్’ రూపొందించిన బ్రేక్ ఫాస్ట్ మెనూతో సరిపోలడం లేదు. నేను చూడాలనుకుంటున్న టూరిస్ట్ స్పాట్లలో కాఫీ హౌస్ తర్వాత స్ధానంలో ఉంది.. ఇన్క్రెడిబుల్ ఉడిపి’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్లో దూసుకుపోతోంది. ఆ మెనూ వినగానే తమకు తినాలనిపిస్తోందని నెటిజన్లు తహతహలాడారు. చాంతాడంత పొడవుగా ఉన్న మెనూ లిస్ట్‌ను ఎంతో ఓపికగా చెబుతున్న వృద్ధుడిని కూడా మెచ్చుకుని తీరాల్సిందే. ఇక ఉడిపి వెళ్లాలనుకునేవారు ఈ మెనూలోని బ్రేక్ ఫాస్ట్ రుచి చూడాలనుకునేవారు శ్రీవిట్టల్ టీ కాఫీ హౌస్‌ని సందర్శించాల్సిందే.
