Angry Teenager: అమ్మ మీద కోపమొచ్చి ఆరేళ్లుగా గొయ్యి తీసి.. అండర్ గ్రౌండ్‌లో ఇల్లు కట్టేసిన టీనేజర్
ఆండ్రెస్ కాంటో అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం తల్లితో గొడవపడ్డాడు. 'నా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లి వచ్చాక బట్టలు మార్చుకోమని అమ్మ చెప్పింది. అవే బట్టలతో ఇంట్లోనే ఉంటానని చెప్పింది.
- Subhan Ali Shaik
- Published On : May 29, 2021 / 08:13 PM IST
Six Years Dig Hole
Angry Teenager: ఆండ్రెస్ కాంటో అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం తల్లితో గొడవపడ్డాడు. ‘నా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లి వచ్చాక బట్టలు మార్చుకోమని అమ్మ చెప్పింది. అవే బట్టలతో ఇంట్లోనే ఉంటానని చెప్పింది. కాకపోతే బెడ్ రూంలోకి వెళ్లి కూర్చోకుండా ఆ 14ఏళ్ల టీనేజర్ వేరే పని చేశాడు.
ఇంటి వెనుక భాగంలో గోయి తీయడం మొదలుపెట్టాడు. కోపంలో ఉన్నప్పుడు పలుగు లాంటిది తీసుకున్నా. తవ్వడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకూ తవ్వి బయటకు వచ్చేవాడ్ని. అలా 3ఏళ్లు జరిగింది.
ఆరేళ్ల తర్వాత చెత్త కుప్ప కింద ఓ అండర్ గ్రౌండ్ బంకర్ తయారైంది. అందులో మెట్లు.. స్టీరియో సిస్టమ్, హీటింగ్, ఓవెన్, సింగిల్ బెడ్ మొత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు రోజు మొత్తంలో ఓ 5గంటలు రిలాక్స్ అవడానికి అందులోనే ఉంటాడట. ఇంకా సొంత తెలివితేటలతో వైఫై సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
Video del lugar en cuastión, preguntas frecuentes y más cueva pic.twitter.com/WHARS9chxc
— Kokomo (@andresiko_16) April 28, 2021
ఆ వాదన నన్ను ఇలా మోటివేట్ చేసింది. మార్చి 2015లో తవ్వడం మొదలుపెట్టా. పొరుగువారు ఎవ్వరూ లేకపోవడంతో బోర్ కొట్టేది. అందుకే ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా. ఓ మూడేళ్ల పాటు ఎంత గొయ్యిని తవ్వగలనో చూద్దాం అని ట్రై చేశా. 2017లో ఆ గొయ్యిని నివాస ప్రాంతంగా మార్చుకుంటే ఎలా ఉంటుందో అనిపించింది.
నా బెస్ట్ ఫ్రెండ్ ను సహాయం కోసం పిలిచా. అప్పటి నుంచి డ్రిల్ సహాయంతో ప్రోసెస్ స్పీడప్ చేశాం. ఇద్దరూ కలిసి సంవత్సరంలోనే 5అడుగులు ఉన్న గొయ్యని 11అడుగుల వరకూ తవ్వేశారు.
నిర్విరామంగా కష్టపడి అండర్ గ్రౌండ్ స్పేస్ పెంచుకున్నాడు. ఆ గుహలోకి ఎంటర్ అయితే ముందుగా మనకు కనిపించేది హీటింగ్ పైప్స్, సెకండ్ రూమ్ సీటింగ్ ఏరియా, స్టీరియో సిస్టమ్, రూం మధ్యలో ఓవెన్ కూడా ఉంది.
ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో బెడ్ రూం అందులో సింగిల్ బెడ్, షెల్వింగ్, నలుగురు ఫ్రెండ్లకు సీటింగ్ కూడా ఉంది. ప్రతి వారం నా ఫ్రెండ్స్ వస్తారు. బీర్ తాగి ఎంజాయ్ చేస్తాం. ఏమైనా మార్పులు ఉంటే వాళ్లు చెప్తూ ఉంటారు. ఈ ఆరేళ్ల ప్రాజెక్ట్ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆండ్రూ అంటున్నాడు.
