Abhijit Deepke : మా అమ్మాయిని చేసుకోండి.. లేదు లేదు.. మా అమ్మాయినే..! అభిజిత్ దీప్కేతో పెళ్లికి క్యూ..
Abhijit Deepke Marriage : అనితా దీప్కే మాట్లాడుతూ.. బోస్టన్‌లో ఉన్న సమయంలోనే అభిజీత్‌తో పెళ్లి విషయమై మాట్లాడామని, అయితే అతను పెద్దగా స్పందించకుండా చిరునవ్వుతోనే సరిపెట్టాడని తెలిపారు.
Marriage proposals surge for CJP founder Abhijeet Dipke after protests says mother Anita Dipke
Abhijit Deepke Marriage : అభిజిత్ దీప్కే.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని స్థాపించిన అభిజిత్.. దేశంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఉద్యమాన్ని నడిపించారు. సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం దిగొచ్చింది. అంతేకాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థి ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ వ్యక్తిగా మారిన అభిజిత్‌ను వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు క్యూ కడుతున్నారంట.
Also Read : Rice Prices : ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు.. పీజేటీఏయూ సంచలన నివేదిక ..
దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు ముఖచిత్రంగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు గత రెండేళ్లుగా వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఆయన తల్లి అనితా దీప్కే వెల్లడించారు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తన కుమారుడికి లేదని, ముందుగా ఆర్థికంగా స్వతంత్రంగా నిలదొక్కుకోవడమే అతని లక్ష్యమని చెప్పారు.
అనితా దీప్కే మాట్లాడుతూ.. బోస్టన్‌లో ఉన్న సమయంలోనే అభిజీత్‌తో పెళ్లి విషయమై మాట్లాడామని, అయితే అతను పెద్దగా స్పందించకుండా చిరునవ్వుతోనే సరిపెట్టాడని తెలిపారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడతాం. తుది నిర్ణయం మాత్రం అతడిదేనని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో అభిజీత్‌కు మరింత గుర్తింపు రావడంతో పెళ్లి ప్రతిపాదనలు కూడా పెరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ చాలా ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ, ముందుగా తన కెరీర్, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలని అభిజీత్ నిర్ణయించుకున్నట్లు ఆయన తల్లి వెల్లడించారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లలో ఒకదాన్ని అంగీకరించినప్పటికీ ఉద్యమం ముగిసిపోలేదని సీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. అభిజీత్ తండ్రి భగవాన్‌రావు దీప్కే మాట్లాడుతూ.. కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని, కుమారుడు ఉద్యమంలోకి దిగినప్పటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నామని చెప్పారు. జూన్‌లో అమెరికా నుంచి భారత్‌కు రావద్దని కూడా కోరామని, అరెస్టు చేసే అవకాశం ఉందన్న భయంతో కొంతకాలం ఇంటిని విడిచి మరో ప్రాంతంలో ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. శారీరక హాని చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని ఆయన తెలిపారు
