250 Terrorists Waiting Across LOC : భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నాలు .. నిఘా వర్గాల హెచ్చరికతో భారత్ ఆర్మీ అలర్ట్

భారత్ లోకి చొరబడేందుకు వందలాదిమంది ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారనే సమాచారంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయ్యింది.

250 Terrorists Waiting across LOC : భారత సరిహద్దుల్లో డేగకళ్లతో జవాన్లు కావాలి కాస్తుంటారు. ఉగ్రమూకలను కన్నెత్తి భారత్ వంక చూస్తే చాలు క్షణాల్లో మట్టుపెడతారు. అయినా భారత్ పై ఉగ్రవాదులు గురి పెడుతునే ఉంటారు. ఈక్రమంలో మరోసారి భారత్ లోకి చొరబడేందుకు వందలాదిమంది ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారనే సమాచారంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. భారత్ లోకి చొరబడటానికి 250మంది ఉగ్రవాదులు సిద్ధపడుతున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. దాదాపు 250మంది ఉగ్రవాదులు పీఓకేలోని పలు లాంచ్ ప్యాడ్ ల వద్ద మోహరించారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత సైన్యం అలర్ట్ అయింది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఎటువంటి పరిస్థితులు ఎదైనా తిప్పికొట్టేందుకు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర కశ్మీర్ లోని కేరన్ పోస్ట్ వద్ద నిఘాను తీవ్రతరం చేసింది.

కాగా..ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినప్పటికీ… డ్రగ్స్ రవాణాలు మాత్రం భారీ ఎత్తున తరలింపులు జరుగుతున్నాయి.డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన కుటిలబుద్ధిని ఎప్పటికప్పుడు చూపిస్తోంది. దీనికి ధీటుగా భారత్ సైన్యం కూడా బదులు చెబుతోంది.
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మాట్లాడుతూ..ఉగ్రవాదులే కాకుండా మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్ లో కి రాకుండా నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. కాగా గత కొంతకాలంగా జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ లు కొనసాగుతునే ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముష్కరులను భద్రతాదళాలు తుదముట్టిస్తునే ఉన్నాయి.







                                    

ట్రెండింగ్ వార్తలు