Assembly Elections 2026 Schedule : అస్లెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..!

Assembly Elections 2026 Schedule : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

assembly elections 2026 election commission announces schedule for assam tamil nadu west bengal kerala and puducherry

Assembly Elections 2026 Schedule : ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఆదివారం సాయంత్రం భారత ఎన్నికల కమిషన్ దీన్ని రిలీజ్ చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల షెడ్యూల్

  • అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా.. మే 4న కౌంటింగ్ జరగనుంది.
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. మే 4న ఫలితాలు ప్రకటిస్తారు.
  • తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తుండగా.. మే 4న కౌంటింగ్ జరగనుంది.

5 ప్రాంతాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని సీఈసీ తెలిపింది. 5 రాష్ట్రాల్లో 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. అలానే ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదని సీఈసీ హెచ్చరించింది.