Axis Bank: హోమ్ లోన్స్‌పై యాక్సిస్ బ్యాంక్ 12 నెలల రుణ మాఫీ
ప్రైవేట్ సెక్టార్ లెండర్ యాక్సిస్ బ్యాంక్ మంగళవారం హోమ్ లోన్స్ తీసుకున్న కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- Subhan Ali Shaik
- Published On : October 20, 2021 / 09:31 AM IST
Axis Bank
Axis Bank: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన యాక్సిస్ మంగళవారం హోమ్ లోన్స్ తీసుకునే కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా పలు ఆన్‌లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్.. సెలక్టెడ్ హోం లోన్ ప్రొడక్ట్స్‌కు 12నెలల ఈఎంఐను మాఫీ చేయనున్నామని తెలిపింది.
టూవీలర్ కస్టమర్లకు సైతం ఎటువంటి ప్రోసెసింగ్ ఫీజు లేకుండా రోడ్ ఫైనాన్స్ కూడా అరేంజ్ చేయనుందట.
బ్యాంకు ఏం చెప్తుందంటే..
మీ హోం లోన్ మీద రెగ్యూలర్ పేమెంట్స్ చేస్తూ ఉన్నవారికి ఎటువంటి ఎక్స్‌ట్రా పేమెంట్ లేకుండా 12నెలల ఈఎంఐ పేమెంట్ మాఫీ అవుతుంది. పదేళ్ల పాటు కట్టిన వారికి మరో 6నెలల రుణ మాఫీ వర్తిస్తుంది. మరో 15ఏళ్లు కట్టిన తర్వాత ఇంకొక 6నెలల రుణ మాఫీ సౌలభ్యాన్ని పొందొచ్చు.
రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది పూర్తి క్లీన్ గా ఉండాలి. అంటే కేవలం మూడు సందర్భాల్లోనే 30రోజుల వరకూ లేటు అయినా పరవాలేదు. లోన్ టైం మొత్తంలో 90రోజులకు మించి లేటు అయితే ఈ పథకానికి అర్హులు కారు. రుణం తీసుకున్న కాలపరిమితి కనీసం 20సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అని బ్యాంకు స్టేట్మెంట్ లో పేర్కొంది.
……………………………………… : ప్రేయసి కోసం శానిటరీ ప్యాడ్‌లు దొంగతనం చేసిన ప్రియుడు
