Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం విషమం
గతంలో కూడా గోపాల్ దాస్ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా మేదాంత ఆసుపత్రిలోనే గోపాల్ దాస్ చికిత్స పొందారు.
- bheemraj
- Published On : April 25, 2022 / 09:37 AM IST
Mahant
Mahant Nritya Gopal Das : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ న్రిత్య గోపాల్ దాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. గత కొద్ది రోజులుగా మహంత్ న్రిత్య గోపాల్ దాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆయన్ను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
గోపాల్ దాస్ ఆరోగ్యస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. చికిత్సను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. అయోధ్యలో రామమందిర్ను నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రకు గోపాల్ దాస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర గర్భగుడి నమూనా చిత్రం విడుదల: 2023 చివరి నాటికి విగ్రహ ప్రతిష్ట
గతంలో కూడా గోపాల్ దాస్ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా మేదాంత ఆసుపత్రిలోనే గోపాల్ దాస్ చికిత్స పొందారు. 2021 అక్టోబరులో కూడా కోవిడ్ సోకిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
