Bank Holidays November 2026 : నవంబర్‌ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. తేదీలివే..

Bank Holidays November 2026 : నవంబర్ నెలలో 16రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో తొమ్మిది రోజులు కాగా.. ఆదివారాలు ఐదుతో పాటు రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

Bank Holidays November 2026

Bank Holidays November 2026 : నవంబర్ నెలలో పెద్ద పండుగైన దీపావళితోపాటు పలు పండుగలు రానున్నాయి. దీనికితోడు జాతీయ వేడుకలుసహా వారాంతపు సెలవుల వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు పెద్ద సంఖ్యలో హాలిడేస్ రానున్నాయి.

Also Read : Vivo X500 Series : వావ్.. వివో నుంచి ఖతర్నాక్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. ధర తెలిస్తే షాకే..!

నవంబర్ నెలలో 16రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో తొమ్మిది రోజులు కాగా.. ఆదివారాలు ఐదుతో పాటు రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. దీంతో ఈ నెలలో మొత్తం 16రోజులు బ్యాంకులు ముసి ఉండే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ప్రాంతీయ పండుగలను బట్టి రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారతాయి.

ఈ నెలలో 9, 10, 11, 13, 16 తేదీల్లో ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. దీంతోపాటు 20, 23, 24 తేదీల్లో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 14వ తేదీ రెండో శనివారం, 28వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. కాబట్టి పాయింట్ ఆఫ్ సేల్ విత్ డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ లేదా ప్రత్యక్ష బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే యూజర్లు ముందుగానే ఈ సెలవుల జాబితాను సరిచూసుకోవడం ఎంతో అవసరం.

సెలవులు ఇలా..
♦ నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.
♦ నవంబర్ 14వ తేదీన రెండో శనివారం, 28వ తేదీన నాల్గో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మిగిలిన తేదీల్లో సెలవులు ఇలా..
♦ నవంబర్ 9వ తేదీ (సోమవారం): దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కీం, మణీపుర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో విశ్వకర్మ రోజు సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
♦ నవంబర్ 10వ తేదీ (మంగళవారం) : గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కీం వంటి ప్రాంతాల్లో దీపావళి సెలబ్రెషన్స్, లక్ష్మీ పూజ, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే వంటివి ఉన్నందున సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 11వ తేదీ (బుధవారం) : సిక్కీం, మణిపుర్, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో లక్ష్మీ పూజ, నింగోల్ ఛకౌబా, బైదూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 13వ తేదీ (శుక్రవారం) : వంగల ఫెస్టివల్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 16వ తేదీ (సోమవారం): ఛట్ పూజ్, సూర్యశక్తి దళ ఛట్ సందర్భంగా బిహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 20వ తేదీ (శుక్రవారం) : ఇగాస్ బగ్వాల్ ఉత్సవాల సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 23వ తేదీ (సోమవారం) : సెంగ్ కుట్ స్నెమ్ సెలబ్రెషన్స్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 24వ తేదీ (మంగళవారం) : గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి, రహాస్ పౌర్ణిమ సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిసా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థానం, జమ్ము, నాగాలాండ్, వెస్ట్ బెం గాల్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ నవంబర్ 27వ తేదీ (శుక్రవారం) : కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.