Viral Video : బండిని ఆపాడ‌ని.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి!

కొంద‌రు తాము చేసేది త‌ప్పు అని తెలిసినా ఏ మాత్రం ప‌ట్టించుకోరు.

Viral Video : బండిని ఆపాడ‌ని.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి!

Bengaluru Man Bites Cop's Finger After Being Caught Without Helmet

కొంద‌రు తాము చేసేది త‌ప్పు అని తెలిసినా ఏ మాత్రం ప‌ట్టించుకోరు. హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి ట్రాఫిక్ పోలీస్ చేతి వేలిని కొరికాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మారింది. ఈ ఘ‌ట‌న బెంగ‌ళ‌రూలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. 28 ఏళ్ల సయ్యద్ సఫీ అనే యువ‌కుడు హెల్మెట్ లేకుండా స్కూటీని న‌డుతున్నాడు. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర దీన్ని గ‌మ‌నించిన ట్రాఫిక్ పోలీసులు అత‌డిని ఆపారు. ఓ కానిస్టేబుల్ స‌ఫీ స్కూటీ కీ ను తీసుకున్నాడు. మ‌రో కానిస్టేబుల్ వీడియో రికార్డు చేస్తున్నాడు. అయితే.. స‌ఫీ వారితో వాగ్వాదానికి దాగాడు. ఓ ద‌శ‌లో అత‌డు తాళాలు తీసుకునేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలిని కొరికాడు. వీడియో ఎందుకు రికార్డు చేస్తున్నావంటూ మ‌రో కానిస్టేబుల్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుకున్నాడు.

Viral Video : ‘3 ఇడియట్స్’ మూవీ సీన్ రియల్ లైఫ్‌లో.. తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి.. వైరల్ అవుతున్న వీడియో..

త‌న వీడియో వైర‌ల్‌గా మారినా తాను పట్టించుకోన‌ని చెప్పాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. పోలీసులు అత‌డిని ప‌ట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దుర్భాష‌లాడ‌డం, శారీర‌కంగా గాయ‌ప‌ర‌చ‌డం, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించినందుకు అత‌డిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.